సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పొత్తుల అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ఈసారి ఎన్డీయే కూటమితో చేతులు కలిపే పార్టీలపైనే అందరి చూపు నెలకొంది. ఎందుకంటే గత ఎన్నికల ముందు మరియు తరువాత ఎన్డీయే నుంచి చాలానే పార్టీలు బయటకు వచ్చాయి. టీడీపీ, జేడీయూ, జెడిఎస్.. వంటి చాలానే పార్టీలు ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకున్నాయి. అయితే మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయా ప్రాంతీయ పార్టీల చూపు మళ్ళీ ఎన్డీయే వైపు మల్లుతోంది. ప్రస్తుతం సౌత్ విషయానికొస్తే టీడీపీ, జెడిఎస్ పార్టీలు ఎన్డీయేతో చేతులు కలిపేందుకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.
గత కొన్నాళ్లుగా బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం చంద్రబాబుతో దోస్తీని లైట్ తీసుకుంటూ వచ్చారు. అయితే ఏపీలో రాజకీయ ప్రయోజనాల నిమిత్తం కమలం పార్టీ టీడీపీతో కలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్దమైతే తప్పకుండా బీజేపీ పెద్దలు ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు ఎన్డీయేలో చేరేందుకు ఆసక్తిగానే ఉన్నప్పటికి ఈ నెల 18న జరిగే ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి టీడీపీకి ఇంకా ఆహ్వానం అందలేదనే టాక్ వినిపిస్తోంది.
Also Read:నిత్యామీనన్ ఇంట విషాదం..
ఇదిలా ఉంచితే అటు కర్నాటకలో జెడిఎస్ పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల]తో పోల్చితే ఈసారి సీట్లు తగ్గడంతో జెడిఎస్ కొంత డీలా పడింది. కాగా సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని చూస్తున్న జెడిఎస్ పార్టీ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్దమౌతోందట. ఎన్డీయే మిత్రపక్షాలతో 18న నిర్వహించే సమావేశానికి ఎడిఎస్ కు ఆహ్వానం కూడా అందిందట. దీంతో జెడిఎస్ పార్టీ బీజేపీతో చేతులు కలపడం దాదాపు ఖాయమైంది. దీంతో మొత్తానికి టీడీపీ, జెడిఎస్ పార్టీలకు మళ్ళీ ఎన్డీయేనే దిక్కుగా మారింది.
Also Read:తలనొప్పి తగ్గించే చిట్కాలు..