కన్ఫర్మ్.. కూటమి పక్కా !

37
- Advertisement -

ఏపీలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఏకం అవుతాయని, కూటమిగా ఏర్పడతాయని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే టీడీపీ, జనసేన పార్టీల మద్య పొత్తు దాదాపుగా ఖాయమే అయినప్పటికి.. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా ఉంటూ వచ్చింది. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ, టీడీపీతో కలవడంపైనే సంధిగ్దంగా ఉంటూ వచ్చింది. అయితే ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీకి జనసేనను కలుపుకొని టీడీపీతో కలవడం తప్పా వేరే దారి లేకపోవడంతో 2014 కూటమి వైపే బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. .

ఇటీవల ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే మూడు పార్టీల పొత్తు ఖాయమే అని విషయం తేటతెల్లమైంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. పొత్తు విషయమై అధిష్టానం ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చిందని, త్వరలోనే పొత్తుపై అధికారిక ప్రకటన ఉంటుందని ఆది నారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో ఇన్నాళ్ళు ముసుగులో దాగి ఉన్న పొత్తు అంశం ఇప్పుడు బహిర్గతం అయింది. కాగా మూడు పార్టీల కూటమి ఉంటుందని చెప్పిన బీజేపీ.. కూటమిలో బీజేపీ పాత్ర ఎంటనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Also Read:చంద్రయాన్-3 విజయవంతం..నెక్స్ట్ టాస్క్ అదే!

కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. దాంతో ఈ సారి కూడా కూటమిదే విజయమని మూడు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే ఆ మద్య బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ, జనసేన పార్టీలు ప్రభుత్వాన్ని స్థాపిస్తాయని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ టీడీపీ ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం. దీంతో అసలు పొత్తు విషయంలో బీజేపీ నేతలు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా ? లేదా వారికే క్లారిటీ లేదా ? అనే ప్రశ్నలు రాకమానవు. మొత్తానికి తాజా పరిణామాలు చూస్తుంటే కూటమి పక్కా అనే సంకేతాలు వస్తున్నాయి. మరి బీజేపీ జనసేన టీడీపీ పార్టీల కూటమి వైసీపీకి ఎంతవరకు పోటీనిస్తుందో చూడాలి.

Also Read:గ్యాస్ సమస్యలకు ఈ ఆసనంతో చెక్!

- Advertisement -