ఇటీవల స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా ఎంతటి చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఏపీలో ఈ పరిణామం సృష్టిస్తున్న అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. తమ నాయకుడిపై కక్ష పూరితంగానే ఈ కేసులు అంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తుంటే.. తప్పు చేయకపోతే నిర్ధోషిగా నిరూపించుకోవాలని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలా హాట్ హాట్ గా సాగుతున్నాయి ఏపీ రాజకీయాలు. అయితే చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం చేయాలని టీడీపీ నేతలు గట్టిగానే ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఇటీవల ప్రారంభం అయిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు టీడీపీ ఎంపీలు. ఇక ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కావడంతో ఇక్కడ కూడా ఇదే అంశాన్ని హాట్ టాపిక్ గా మలచాలని టీడీపీ శ్రేణులు వ్యూహాలను రెడీ చేసుకున్నారు..
ప్రతిఒక్క టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరు కావాలని టీడీపీ జాతీయ ప్రదానకార్యదర్శి నారా లోకేశ్ ఆదేశాలు జారీ చేయడంతో నేడు ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ కి సంబంధించిన అందరు ఎమ్మేల్యేలు హాజరయ్యారు. సభ ప్రారంభం అయినది మొదలుకొని చంద్రబాబు అరెస్ట్ అంశంపై చర్చ చేపట్టాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ వచ్చారు టీడీపీ ఎమ్మేల్యేలు. అంతేకాకుండా స్పీకర్ పోడియం వద్దకు చేరి గందరగోళం సృష్టించారు కూడా. అయితే టీడీపీ శ్రేణులు ఊహించని విధంగా చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు సిద్దమని వైసీపీ ప్రభుత్వ నేతలు చెప్పడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే.
Also Read:KTR:250 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్ 3 విస్తరణ