Chandrababu:తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం

22
- Advertisement -

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు…ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అన్నారు. తెలంగాణ తలసరి ఆదా యం రూ.3 లక్షలు ఉంటే, ఏపీ తలసరి ఆదా యం రూ.2 లక్షలుగా ఉందని చెప్పారు.

రెండు రాష్ట్రా ల మధ్య ఉన్న సమస్యలు పరిషరించుకుందామని తానే రేవంత్‌రెడ్డికి లేఖ రాశానని చెప్పారు. దేశానికి దశ దిశను చూపిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఆర్థిక సంసరణలు అమలు, సంపద సృష్టి ఆయన కాలంలోనే ప్రారంభమైందని చెప్పారు. తన చివరి రక్తం బొట్టు వరకూ తెలుగుజాతి కోసం పనిచేస్తానని చెప్పారు. వచ్చే 30 ఏండ్లలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఒక విజన్‌ ఆలోచిస్తానని తెలిపారు.

ప్రసంగం అనంతరం జై హింద్‌.. జై తెలుగుదేశం.. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

Also Read:‘మిస్టర్ బచ్చన్’.. ఫస్ట్ సింగిల్

- Advertisement -