జగన్ పైకి ‘స్కామాస్త్రాలు’!

49
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే నిత్యం ప్రజల్లో ఉండేందుకు వైసీపీ గట్టిగా ప్లాన్ చేస్తోంది. అటు టీడీపీ కూడా జగన్ టార్గెట్ గా ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్ధమౌతోంది. మొన్నటి వరకు చంద్రబాబు జైలు అంశంతో సతమతమైన టీడీపీ.. ఇప్పుడు వ్యూహాత్మకంగా ప్రజా మద్దతు కోసం అడుగులు వేస్తోంది. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా జగన్ స్కిల్ స్కామ్ సంధించిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ఎలాంటి పూర్తి ఆధారాలు లేకపోవడంతో అదంతా కక్ష పూరిత వ్యవహరంగా మారింది. ఈ నేపథ్యంలో తనను అక్రమంగా జగన్ అరెస్ట్ చేయించారని సైకో పాలన జరుగుతోందని ప్రజల్లో సానుభూతి పెంచుకుంటున్నారు చంద్రబాబు.

ఇదే సందర్భంలో అటు జగన్ ను ఇరకాటంలో పెట్టె విధంగా అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సి‌ఎం జగన్ పై టీడీపీ చేసిన కొన్ని ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో రు. 45 వేల కోట్ల నుంచి రూ. 50 వేల కోట్ల వరకు టీడీఆర్ స్కామ్ జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ముఖ్య నగరాల్లో ఈ స్కామ్ భారీగా జరిగిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఒక్క తిరుపతిలోనే రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి చెబుతున్నారు. దీంతో ఈ టీడీఆర్ స్కామ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలకు తావిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడిపై వైసీపీ సర్కార్ స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రేడ్ స్కాం, అమరావతి రింగ్ రోడ్ స్కామ్.. వాటి వాటిని సంధించగా ఇప్పుడు జగన్ పైకి టీడీపీ కూడా అదే స్థాయిలో స్కామ్ లను బయట పెడుతుండడంతో టీడీపీ ఆరోపిస్తున్న స్కామ్ లు జగన్ పై ఎలా ప్రభావం చూపబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

Also Read:ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..

- Advertisement -