జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును లోకేష్, బాలకృష్ణతో కలిసి పరామర్శించారు పవన్. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే పోటీచేస్తామని ప్రకటించారు. రేపటి నుండి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు.
గత నాలుగేళ్లుగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుష్పరిపాలనకు చంద్రబాబు అరెస్ట్ నిదర్శనమన్నారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. టీడీపీతో నాకు విభేదాలు ఉన్నాయి కానీ ఏనాడూ చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. అవినీతి కేసుల్లో బెయిల్ పై జగన్ అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారన్నారు.
వివేకానందరెడ్డి హత్యపై అందరూ జగన్ వైపే వేలెత్తి చూపుతున్నారని.. జగన్ ఆర్థిక నేరస్థుడు అని మండిడ్డారు. టీడీపీతో కలవడం తమ రాజకీయ భవిష్యత్ కోసం కాదు…ఏపీ బాగుకోసమని తేల్చిచెప్పారు.
బీజేపీ కూడా మాతో పాటు వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.
Also Read:రవితేజతో ఫిక్స్.. ఆశ్చర్యపోనక్కర్లేదు