- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులతో సోమవారం రాత్రి తొలిజాబితాను ప్రకటించింది. ఒక సీటుకు ఒకే పేరు పరిశీలనలో ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆదేశించడంతో తొమ్మిది మంది పేర్లను ప్రకటించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. 14 స్థానాలకు తెదేపా పోటీ చేస్తుందని భావిస్తుండగా వివాదం లేని 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
1) ఖమ్మం – నామా నాగేశ్వర రావు
2) సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య
3) అశ్వరావుపేట – మచ్చ నాగేశ్వరరావు
4) వరంగల్ పశ్చమం – రేవూరి ప్రకాశ్‌రెడ్డి
5) మక్తల్ – కొత్తకోట దయాకర్‌రెడ్డి
6) ఉప్పల్ – వీరేందర్‌గౌడ్
7) మహబూబ్‌నగర్ – ఎర్ర శేఖర్
8) శేరిలింగంపల్లి – భవ్య అనంద్ ప్రసాద్
9) మలక్‌పేట – ముజఫర్
- Advertisement -