మళ్ళీ ఎన్డీయే లోకి టీడీపీ..?

39
- Advertisement -

ఏపీ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న టీడీపీ.. అందుకోసం అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తోంది. సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న వైసీపీ సర్కార్ ను పడగొట్టలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి కొంచెం కష్టమే. అందుకే ఇతర పార్టీల బలాన్ని కూడా కలుపుకోవాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తును దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక అధికారిక ప్రకటనే తరువాయి. .

ఇక జనసేనతో పాటు బీజేపీని కూడా కలుపుకుంటే వైసీపీని ఈజీ గా ఎదుర్కోవచ్చనే ప్లాన్ లో ఉన్నారు చంద్రబాబు. అందుకే బీజేపీతో కలిసేందుకు గత కొన్నాళ్లుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు అవకాశవాది అనే ఉద్దేశంతో టీడీపీతో కలిసేందుకు ససేమిరా అంటూ వచ్చారు బీజేపీ పెద్దలు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే టీడీపీతో కలవడం తప్ప వేరే దారి లేదన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది. దీంతో 2014 ఎన్నికల్లో ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్దలతో పలుమార్పు పొత్తుకు సంబంచించిన అంశాలను అంతర్గతంగా చర్చిస్తూ వచ్చారట చంద్రబాబు.

Also Read:‘మిషన్ సౌత్’ రంగంలోకి మోడి..?

ఇక ఈ నెల 18న బీజేపీ పెద్దలతో భేటీ అయ్యేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ భేటీ తిరిగి ఎన్డీయే కూటమిలో కలిసేందుకే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల సమయంలో బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్డీయే కూటమిదే విజయం అని సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో తిరిగి ఎన్డీయేతో కలవడమే ఉత్తమం అని భావించిన చంద్రబాబు.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీయేలో కలిసేందుకు బీజేపీ పెద్దలు ఎంతవరకు అంగీకరిస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:హ్యాపీ బర్త్ డే…ధోని

- Advertisement -