- Advertisement -
తప్పుడు విద్యార్హతతో ప్రమోషన్ పొందిన టీడీపీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబకు సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు అశోక్ బాబు…డీకామ్ బదులుగా బీకామ్ అని తప్పుగా పడిందని చెప్పారు. 2019లోనే ఈ కేసు ముగిసిందని…రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసును తెరపైకి తీసుకువచ్చారని చెప్పారు.
ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు నారా లోకేశ్. అశోక్ బాబుకు అండగా టీడీపీ ఉంటుందన్నారు.
గత నెల 25న వివిధ సెక్షన్ల కింద అశోక్ బాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో నిన్న అర్థరాత్రి అశోక్ బాబును అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -