టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సీఐ దేవేంద్ర కుమార్ ఫిర్యాదుతో ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
బొందలదిన్నె వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఆయన తన అనుచరులతో కలిసి పోలీసుతో వాగ్వాదానికి దిగగా ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దీంతో పటిష్ట బందోబస్తూ ఏర్పాటుచేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
రవాణా శాఖలో రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిపారన్న కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని రెండు నెలల క్రితం అరెస్టు చేసి కడప జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన జేసీకి స్వాగతం పలుకుతూ..ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి, అనుచరులు భారీ ర్యాలీ నిర్వహించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో జేసీ వాహన ర్యాలీని బొందలదిన్నె వద్ద అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.