ఏపీలో టీడీపీ జనసేన పార్టీల మద్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. చంద్రబాబు జైలుకు వెళ్ళిన తరువాత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తును కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ రెండు పార్టీలు నామమాత్రంగానే పొత్తులో ఉంటాయా ? లేదా కలిసి నడుస్తాయా ? అనే అనుమానాలను చాలమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఆ పార్టీతో ఏనాడూ కలిసి నడిచింది లేదు. కనీసం ఇరు పార్టీలు ఏ కార్యక్రమాన్ని నిర్వహించింది లేదు. దీంతో ప్రజలు కూడా జనసేన బీజేపీ పొత్తును లైట్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు టీడీపీ జనసేన విషయంలో కూడా అదే జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమౌతు వచ్చాయి. .
అయితే ఆ సందేహాలన్నిటిని పటాపంచలు చేస్తూ టీడీపీ జనసేన కలిసి నడిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఇరు పార్టీల అధినేతలు. ఇప్పటికే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసిన రెండు పార్టీలు… ఇకపై ఎలాంటి కార్యక్రమం అయిన, ఏ విధమైన బహిరంగ సభలు అయిన కలిసే నిర్వహించాలని భావిస్తున్నాయట. తాజాగా రాజమండ్రిలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ ప్రారంభం అయింది.
ఈ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా పాల్గొనన్నారు. ఎన్నికలకు సరిగ్గా ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ ఎనిమిది నెలల్లో కూటమిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. జనసేన వారాహి యాత్ర, అలాగే టీడీపీ నిర్వహించే భవిష్యత్తు కు గ్యారెంటీ, నిజం గెలవాలి, వంటి కార్యక్రమాలను ఇరు పార్టీల నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లెలా వ్యూహాలు రచిస్తున్నారట. ఇకపోతే సీట్ల పంపకాల విషయంలో కూడా వీలైనంత త్వరగా ఏకాభిప్రాయానికి రావాలని టీడీపీ జనసేన కూటమి భావిస్తోంది. మరి ఈ రెండు పార్టీల ప్రణాళికలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read:రస్టిక్ థ్రిల్లర్.. ‘మంగళవారం’