టీడీపీ జనసేన వస్తే.. అవన్నీ రద్దు?

22
- Advertisement -

ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ? ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేనలను దెబ్బ కొట్టేందుకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యర్థుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ముఖ్యంగా తన పాలనలో అమలౌతున్న పథకాలు అలాగే కొనసాగాలంటే వైసీపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు. ఎందుకంటే సంక్షేమమే ధ్యేయంగా ఏపీలో ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు.. అమ్మ ఒడి , రైతు భరోసా, వాహన మిత్రా, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం.. ఇలా ఆయా పథకాల ద్వారా లభ్దిదారుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నారు సి‌ఎం జగన్.. ఈ పథకాల అమలు సజావుగా జరగాలంటే తిరిగి వైసీపీ పాలననే కొనసాగాలని పిలుపునిస్తున్నారు.

ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్ని రద్దు అవుతాయని, ఘంటాపథంగా చెబుతూ ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు. దీనిపై ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ ప్రస్తుతం అమలౌతున్న అన్నీ పథకాలు తమ పాలనలో కూడా అమలౌతాయని, ఇంకా కొత్త పథకాలు కూడా అమల్లోకి తీసుకొస్తామని స్పష్టతనిచ్చారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే వాలెంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు కూడా రద్దవుతాయని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అయితే వాలెంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని గతంలోనే టీడీపీ, జనసేన పార్టీలు క్లారిటీ ఇచ్చాయి. అయినప్పటికి వీటి విషయంలోనే టీడీపీ జనసేన పార్టీలను డిఫెన్స్ లో పడేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పథకాలు రద్దవుతాయని జగన్ తరచూ వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:లోక్ సభ ఎన్నికలపై.. సంచలన సర్వే !

- Advertisement -