కుప్పంలో పర్యటించిన బాబు.. సీఎం జగన్‌పై ఫైర్‌..

109
- Advertisement -

గురువారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఇందులో భాగంగా దేవరాజపురంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తా…కార్యకర్తలు, ప్రజలను కలుసుకుంటాను. నేను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించే ఆలోచించాను అన్నారు. ప్రస్తుతం నిత్యావసరాలు తీవ్ర భారంగా మారిపోయాయి. పొరుగున ఉన్న రాష్ట్రంలో పెట్రో ధరలు 10 రూపాయలు తక్కువగా ఉంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం తగ్గించేలేదు. ఎవడబ్బ సొమ్మని ఓటీఎస్‌ కు 10 వేలు కట్టమని అడుగుతున్నారని బాబు మండిపడ్డారు. వాలంటీర్లు బెదిరిస్తే భయపడకండి…టీడీపీ వచ్చిన తరువాత పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని బాబు తెలిపారు.

నన్ను కూడా బుతులు తిట్టే పరిస్థితికి వచ్చారు. రౌడీయిజం చెయ్యడం ఒక్క నిమిషం పని… కానీ అది మన విధానం కాదు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నా …అందరి లెక్కలు తేల్చుతామని బాబు హెచ్చరించారు. రెండు ఘటనలు కుప్పంలో నన్ను బాధించాయి. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు నన్ను బాధపెట్టాయి. కుప్పంలో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదు. వెయ్యి, రెండు వేల పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ. కుప్పంలో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే….మిమ్మల్ని అన్నట్లు కాదా! మనం కూడా ప్రలోభాలకు లొంగిపోతే ఎలా?.. మనం బాగా పనిచేయాలి….కుప్పంలో కోవర్ట్ లను పంపేస్తా…ప్రక్షాళన చేస్తా అని బాబు అన్నారు.

రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు…మేము అనుకుంటే ఇంట్లోంచి బయటకు రాలేరు. కుప్పంలో మనం అంతా ఏకం ఐతే పోలీసులు ఏమి చెయ్యగలరు. కుప్పంలో కార్యకర్తల ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటా. కుప్పంలో మీరు వద్దన్న నేతలను, నష్టం చేసే వారిని ఉపేక్షించను. నేను నియోజకవర్గం మార్చలా.. ఆ అవసరం ఉందా!? నేను కుప్పానికి ముద్దు బిడ్డను.. కుప్పం వదిలి ఎక్కడికి పోను అని బాబు వ్యాఖ్యానించారు. అవతలివాళ్లు కుప్పంపై హేళన చేస్తే నాకు బాధకలిగింది. కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబును సభలో చూడాలని జగన్ అన్నాడు. చివరికి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేసి ఆనందం పొందుతారా! అని విమర్శించారు. అందుకే మళ్ళీ సీఎంగానే శాసనసభకు వెళ్తా అని చెప్పాను. సభా గౌరవం కాపాడుతా. ప్రతిపక్షం పట్ల తమిళనాడులో స్టాలిన్ ఎంత గౌరవంగా ఉన్నారు.. ఇక్కడ జగన్ ఎలా ఉన్నాడు అని దుయ్యబట్టారు బాబు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా…ఏ కార్యకర్తపై ఒక్క దెబ్బపడినా…నాపై పడినట్లే. క్యాడర్‌ను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టను అని చంద్రబాబు తెలిపారు.

- Advertisement -