బీజేపీ పతనం మొదలయ్యింది..

188
- Advertisement -

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా దేశ ప్రజలను మోసం చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రజా సంఘాల జేఏసీ చైర్మైన్ గజ్జెల కాంతం. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నడ్డా దేశ ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని చెబుతారా..? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.. బండి సంజయ్ ఉద్యోగులకు న్యాయం చేస్తా అని దీక్ష అంటారు.. ఉద్యోగులకు ఏమి అన్యాయం జరుగుతుందని దీక్ష చేశారు. దేశ జనాభాలో 70 కోట్ల యువత ఉన్నారు ఏమి న్యాయం చేశారు.

ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారు..ఇవ్వలేదు.. 2014 నుంచి రిజర్వేషన్లు అమలు చేయలేదు. ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్ల ద్వారా ప్రతి సంవత్సరం 12 లక్షల 73 వేల ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదు.. బీసీలకు సంవత్సరానికి 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు.. రాష్ట్రంలో ఉద్యోగాల గురించి అడిగే హక్కు బీజేపీ జాతీయ రాష్ట్ర అధ్యక్షునికి లేదు అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తాది.. బీజేపీ పాలిత రాష్ట్రలలో రిజర్వేషన్లు అమలులో లేదు.. ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు హక్కుల కోసం పోరాటం చేస్తే జైల్‌లో పెట్టారు..

బీజేపీ పాలిత రాష్ట్రలలో ఒక న్యాయం,తెలంగాణలో ఒక న్యాయమా..? బీజేపీ పాలిత రాష్ట్రలలో ఉద్యోగుల భద్రత లేదు. గాంధీని చంపిన మీరు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మొక్కుతున్నారు అంటే దేశ ప్రజలను మోసం చేస్తున్నారా.? అని ప్రశ్నించారు. పంజాబ్‌కు వెళ్తే బహిరంగ సభలో ప్రజలు లేరని వెనక్కి వచ్చారు మోడీ. బీజేపీ పతనం మొదలయ్యింది.. బీజేపీ అధికారంలోకి వచ్చక దేశ ప్రజలకు రక్షణ లేదు అని గజ్జెల కాంతం విమర్శించారు.

- Advertisement -