దేశంలో మహిళలకు ఉపాధి కల్పించే అగ్రగామి…

238
- Advertisement -

భారత్‌లోనే అత్యధికంగా మహిళలకు ఉపాధికల్పించే సంస్థల్లో రతన్‌టాటా వారి టీసీఎస్‌ టాప్‌ వన్‌ నిలిచిందని…యాక్సిస్ బ్యాంక్ బుర్గుండి ప్రైవేట్‌ మరియు హురున్‌ సంస్థ పేర్కొంది. ఇండియాలోని టాప్‌ 10కంపనీలు అత్యధికంగా మహిళలకు ఉపాధిని కల్పిస్తున్న జాబితాను రూపొందించారు.

ఈ జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ 2.1లక్షల మహిళలకు ఉపాధి కల్పిస్తూ శ్రామిక శక్తిలో 35శాతం మహిళ ఉద్యోగులను నియమించింది. టీసీఎస్ తర్వాత స్థానాల్లో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ సంస్థలు వరుసగా 40, 36, 28, 18 శాతం మహిళ ఉద్యోగులను కలిగి ఉన్నాయి.

టాప్ టెన్‌లోని 10 మహిళా ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మదర్‌సన్‌ సుమీ సిస్టమ్స్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్, పెజ్‌ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. ఈ కంపెనీలలో, ₹55,511 కోట్ల విలువైన పేజ్ ఇండస్ట్రీస్ 74 శాతం మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 41 శాతం మంది మహిళలతో మదర్సన్ సుమీ సిస్టమ్స్ తర్వాతి స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి…

గ్రూప్‌ 4తో వార్డు ఆఫీసర్ల నియామకం..

పాక్‌ ఆభ్యర్థనను తిరస్కరించిన మాస్కో…

తెలంగాణకే ఆదర్శంగా మునుగోడు..

- Advertisement -