KTR:తెలంగాణలోకి టీసీఎల్ గ్లోబల్ సంస్థ

52
- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా  తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ అయిన ‘TCL Global’ను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతున్న నూతన ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లో వాషింగ్‌ మెషిన్‌లను ఉత్పత్తి చేయనున్నారు. భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్‌లను కూడా ఉత్పత్తి చేసే ప్రణాళికతో కంపెనీ ఉన్నది అని మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు. రూ.225కోట్ల పెట్టుబడితో ‘TCL Global’ తన యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నది. దాంతో రాష్ట్రంలో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యంకానున్నాయి.

Also Read: ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్..

- Advertisement -