ప్రపంచంలో అత్యంత ఖరీదైన మనుషులను చూసారా మీరు. కానీ అత్యంత ఖరీదైన పిల్లులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఇది నిజం. టేలర్ స్వీఫ్ట్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న స్కాటిష్ ఫోల్డ్ ఒలివియా బెన్సన్ పిల్లి అక్షరాల 97మిలియన్‌్ డాలర్ల ఉంది. ఇది మన దేశ కరెన్సీలో చెప్పాలంటే రూ.800కోట్లుగా ఉంటుంది. ఇంత ఖరీదైన పిల్లి ప్రపంచంలో మూడవ సంపన్న పెంపుడు జంతువుగా రికార్డు సృష్టించిందని ఆల్ అబౌట్ క్యాట్స్ అనే నివేదిక పేర్కొంది. అయితే పిల్లి కంటే ముందు ఉన్న రెండవ మొదటి స్థానంలో ఉన్న పెంపుడు జంతువులు ఎవో మీకు తెలుసా…
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం యూఎస్ ఆధారితంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయేన్సర్ @nalaక్యాట్ సియామీ మరియు టాబీ మిక్స్ విలువ 100మిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. అయితే ఇటాలియన్ మీడియా కార్పొరేషన్ గున్థర్ కార్పొరేషన్ సంస్థ దగ్గర ఉన్న జర్మనీ షెపర్డ్ 500మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. తాజాగా మూడవ స్థానంలో ఉన్న స్కాటిష్ ఫోల్డ్ ఒలివియాను పోస్ట్ చేసిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దాదాపుగా 2మిలియన్లకు పైగా లైక్ లు వచ్చాయి. ఇంతేగాక ప్రపంచంలో సంపన్న పెంపుడు జంతువుల జాబితాలో ఓప్రా విన్‌ఫ్రే కుక్కలు సాడీ సన్నీ లారెన్ లైలా మరియు ల్యూక్ ఒక్కొక్కటి దాదాపుగా 30మిలియన్ల్ డాలర్ల విలువ కలిగిన సంపన్న పెంపుడు జంతువులగా ఉన్నాయి. అన్నట్టు ఈపిల్లి పేరు ఎంటో తెలుసా… బెంజిమన్ బటన్. 2008లో వచ్చిన ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ సినిమాలోని బ్రాడ్ పిట్ పేరును ఈ పిల్లికి నామకరణం చేశారు.
ఇవి కూడా చదవండి…