- Advertisement -
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ ఇంటిపై ఐటీ దాడులు కలకలం రేపాయి. ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేత వంటి కారణాలతో అధికారులు సోదాలు చేపట్టారు. 2013లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన చిత్ర రామకృష్ణ…అనూహ్యంగా 2016లో పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ క్రమంలో ఆమె ఎన్‌ఎస్‌ఈలో ఏ చిన్న పనికావాలన్నా హిమాలయలోని ఓ యోగిని సంప్రదించారు. స్టాక్ ఎక్స్చేంజ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించడం, ఆపై ఆయనను గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ సలహాదారుగా మార్చడం వివాదాస్పదం అయ్యాయి. సంస్థకు సంబంధించిన ఎంతో కీలక, రహస్య సమాచారాన్ని సైతం చిత్రా రామకృష్ణ ఆ హిమాలయ యోగితో పంచుకున్నట్టు సెబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి.
- Advertisement -