తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి రెండు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక హౌంస్లౌ మేయర్ కారెన్ స్మిత్, భారత సంతతికి చెందిన మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ మరియు నిర్మల దంపతులు , భారత హై కమీషన్ ప్రతినిధి అజయ్ కుమార్ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర ఎఫ్దీసి మాజీ చైర్మన్ మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, కౌన్సిలర్లు ప్రీతమ్ గ్రేవాల్ , అజ్మీర్ గ్రేవాల్ మరియు ప్రభాకర్ ఖాజా పాల్గొన్నారు.
గత కెసిఆర్ గారి నాయకత్వం లో చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మాజీ మంత్రి కే.టి.ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా నేడు కూడా వేడుకలను “చేనేత బతుకమ్మ మరియు దసరా” గా జరుపుకున్నామని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు.
హాజరైన ముఖ్య అతిధులు మాట్లాడుతూ …యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని టాక్ సంస్థను చూసి గర్వపడుతున్నామని తెలిపారు.టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న మమ్మల్ని సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతు…. నేడు ఈ వేడుకలకు టాక్ సంస్థ కార్యకర్తగా మరియు మన తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చెయ్యాలనే సంకల్పం తో పాల్గొనడం జరిగిందని, ముందుగా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ గడ్డ పై ఎత్తిన జెండాను దించ కుండా అది రాజకీయ వేదికలైన సామాజిక సంస్థలకు సంబందించిన వేదికలైన ప్రపంచానికే స్ఫూర్తిగా
ఆదర్శంగా టాక్ కార్యవర్గం నిలిచిందని వారందరిని ప్రత్యేకంగా అభినందించారు.హాజరై విజయవంతం చేసిన అతిథులకు, ప్రవాస బిడ్డలకు, సహకరించ ప్రతీ ఒక్కరికి అనిల్ కృతఙ్ఞతలు తెలిపారు.ఎఫ్‌ఫ్దీసి మాజీ చైర్మన్ గా కెసిఆర్ గారి నాయకత్వంలో తెలుగు సినీ పరిశ్రమ రాష్ట్రంలో మరియు ముఖ్యంగా హైదరాబాద్ లో గొప్పగా అభివృద్ధి జరిగి ఇక్కడే స్థిరపడేలా ఎంతో కృషి చేశారన్నారు.
Also Read:రాత్రిపూట నిద్రలో కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయా?