టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపొందనుంది. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.జూన్‌లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో మహేష్ సరసన పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నందమూరి తారకరత్నను తీసుకోడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేశారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే శనివారం తారకరత్న చేసిన ట్వీట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. #SSMB28 అనే హ్యాష్ ట్యాగ్ పెట్టిన నందమూరి హీరో.. ఇందులో అతని పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న డాక్టర్ రోల్ అనుకునే విధంగా ఎమోజీలు జత చేశారు. దీంతో తారకరత్న ఈ సినిమాలో నటించనున్నట్లు క్లారిటీ వచ్చింది. మహేష్ సినిమాలో విలన్‌గా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నందమూరి హీరో నటిస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరుగుతుంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.