హీరోగా కెరీర్ ప్రారంభించి విలన్‌గా మెప్పించిన నటుడు నందమూరి తారకరత్న. కెరీర్‌లో 20కి పైగా సినిమాలు చేసిన తారక్ త్వరలోనే రాజకీయ ఆరంగేట్రం చేయాలని భావించారు. కానీ అంతలోనే శివైక్యం పొందారు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. శనివారం రాత్రి 9.30కి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.
2022లో ఒకటో నెంబర్ కుర్రాడుతో వెండి తెరకు పరిచయం అయిన తారకరత్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతోనే ఒకేసారి 9 సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. అయితే తర్వాత పలు సినిమాలు డిజాస్టర్ కావడంతో కెరీర్ నెమ్మెదించింది.
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో విలన్‌గా మెప్పించారు. ఈ సినిమాలో ఆయన నటనకు ఉత్తమ విలన్ అవార్డు లభించింది. చెన్నైలో 1983 జనవరి 8వ తేదీన నందమూరి మోహనకృష్ణ, సీత దంపతులకు తారకరత్న జన్మించారు. మోహనకృష్ణ దంపతులకు తారకరత్న ఒక్కగానొక్క కొడుకు. హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు.
తారకరత్న పెళ్లి అప్పట్లో హాట్ టాపిక్. అలేఖ్యరెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి తారకరత్న తల్లిదండ్రులకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ ఇష్టం లేదు. అలేఖ్య రెడ్డికి అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకోగా ఆమెను వివాహం చేసుకున్నారు తారక్. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బంధువే అలేఖ్య రెడ్డి. నందీశ్వరుడు సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు అలేఖ్యరెడ్డి.
ఇవి కూడా చదవండి..