మోక్షజ్ఞకు తారక్ స్పెషల్ విషెస్

11
- Advertisement -

నందమూరి ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ తనయుడు హీరోగా సినిమా తెరకెక్కుతుండగా ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నందమూరి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. తాతగారి ఆశీస్సులు నీపై ఉండాలని కోరుకుంటున్నా అన్నారు ఎన్టీఆర్.

స్టార్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ బాలయ్య కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. సింబా ఈజ్‌ కమింగ్‌ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. దీంతో అభిమానులు విషెస్‌ చెబుతున్నారు.

 

- Advertisement -