రాంచరణ్‌కు ఛాలెంజ్‌ విసిరిన తారక్‌

315
NTR

కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఓ సరికొత్త ఛాలెంజ్‌ను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారతీయులు ఫిట్‌నెస్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ‘హమ్‌ ఫిట్‌తో ఫిట్‌ ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. రాథోడ్ విసిరిన ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దగ్గరి నుంచి కోహ్లి వరకు ఈ ఛాలెంజ్‌ని స్వీకరించారు.టాలీవుడ్,బాలీవుడ్ ప్రముఖులు సైతం రాథోడ్‌ ఛాలెంజ్‌కు స్పందిస్తున్నారు.

తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ని జూనియర్ ఎన్టీఆర్‌కి విసరగా ఆయన స్పందించారు. తాను జీమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోని ట్విట్టర్‌లో పోస్టు చేసి కళ్యాణ్ రామ్,మహేష్ బాబు,రాంచరణ్‌,రాజమౌళి,కొరటాల శివకు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు. రాంచరణ్‌కు అకౌంట్‌ లేకపోవడంతో ఉపాసనను ట్యాగ్‌ చేసి చరణ్‌కు మీరు చెప్పండి అని పేర్కొన్నారు. మొత్తంగా కేంద్రమంత్రి చేపట్టిన ఫిట్ నెస్‌ ఛాలెంజ్‌కు రానున్న రోజుల్లో మరింత స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది.