Pushpa 2: బన్నీతో తారక్ భేటీ

50
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. ఇందుకు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోని పుష్ప 2 సెట్స్ వేదికైంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న NTR30 సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సెట్స్ పక్కనే బన్నీ పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. ఈ రెండు సినిమాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా షూటింగ్ ప్యాకప్ చెప్పాక బన్నీతో భేటీ అయ్యారు తారక్.

ఇద్దరూ ఒకే హోటల్‌ ఉండడం వల్ల తారక్‌ సరదాగా బన్నీని, దర్శకుడు సుకుమార్‌ను కలిశారట. రెండు చిత్రాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారని టాక్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read:మోసపోయాను.. ఎమోషనలైన నటి

ఇక బన్నీ- తారక్ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరికొకరు బావా అని పిలుచుకుంటారు.

Also Read:ఉదయం లేవగానే ఫ్రూట్స్ తింటున్నారా?

- Advertisement -