అనురాగ్ కశ్యప్ ఫిల్మ్ లో తాప్సి…

241
tapsi-in-anurag-kashyap-direction
- Advertisement -

టాలీవుడ్ పై నోరు పారేసుకుంటూ బాలీవుడ్ లో సెటిల్ అయింది తాప్సీ పన్ను. బాలీవుడ్ లో ‘పింక్’ చిత్రంతో గుర్తింపు తెచ్చేసుకుంది ఈ అమ్మడు. టాలీవుడ్ లో కూడా ‘ఆనందో బ్రహ్మ’ అంటూ మంచి హిట్ నే అందుకుంది. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది ఈ మిల్కీ బ్యూటీ. అయితే ఇప్పుడు తాప్సీ పై ఓ న్యూస్ మీడియాలో ప్రముఖంగా వినపడుతుంది. తాప్సి ఇటీవల బాలీవుడ్ లో జూడ్వా 2 అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమ్మడు బికినీ వేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ గా సినిమా హిట్ అవ్వడంతో మరికొన్ని బడా ప్రొడక్షన్ లో నుండి ఛాన్సులను వస్తున్నాయి.

Tapsi

రీసెంట్ గా ఒక కల్ట్ సినిమాలో నటించే ఛాన్స్ ను తాప్సి దక్కించుకొంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెక్స్ట్ ఫిల్మ్ లో తాప్సి కీ రోల్ పోషించనుందట. ఇప్పటి వరకూ తను స్టార్ అనిపించుకోలేకపోయానంటూ ఈ మధ్యనే అసహనం వెళ్లగక్కిన ఈ భామకు ఇది మంచి అవకాశమే అని చెప్పవొచ్చు. నిజానికి ఈ పాత్రను మొదట దంగల్ భామ సాన్యా మల్హోత్రాకు ఆఫర్ చేశారు.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ తాప్సీ పన్ను ముంగిట వాలిందని తెలుస్తోంది. అటు స్టోరీ పై.. డేట్స్ పై డిస్కషన్స్ కూడా జరిగిందని సమాచారం. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరి కొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టులోకి తాప్సీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

- Advertisement -