అమితాబ్‌ వ్యాఖ్యలపై ఆవేదన చెందిన తనుశ్రీ ..

231
Tanushree Dutta
- Advertisement -

బాలీవుడ్ లో హీరోయిన్ తనుశ్రీ దత్తా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత తనను సీనియర్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కూడా తనను లైంగికంగా వేధించాడని ఆమె చెప్పింది. ఈ అంశంపై మీడియా వర్గాలు అమితాబ్‌ను ప్రశ్నించగా..‘నా పేరు తనుశ్రీ కాదు. నేను నానా పటేకర్‌నూ కాదు. అలాంటప్పుడు నేనెలా స్పందిస్తాను?’ అన్నారు. దీంతో అమితాబ్ వ్యాఖ్యలపై తనుశ్రీ దత్తా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Tanushree Dutta

అమ్మాయిల సమస్యల గురించి స్పందించని అమితాబ్ లాంటి వ్యక్తులు సామాజిక కథాంశాల ఆధారంగా ‘పింక్’ వంటి సినిమాలు తీస్తున్నారని విమర్శించింది. ఇలాంటి వ్యక్తులు నిజజీవితంలో కళ్ల ఎదుట జరిగే దారుణాన్ని ప్రశ్నించరనీ, కళ్లు మూసుకుంటారని వ్యాఖ్యానించింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తాను చివరివరకూ పోరాడుతానని స్పష్టం చేసింది. ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రముఖులు నాకు మద్దతు తెలుపుతున్నారు.

ఇది ఎంతవరకు వెళుతుందో నేనూ చూస్తాను. ఇక నేను బాలీవుడ్‌లోకి మళ్లీ తిరిగి రాను. నాకు అమెరికా పౌరసత్వం ఉంది. అక్కడికే వెళ్లిపోతాను. బాలీవుడ్‌లో ఇంత అవమానాన్ని ఎదుర్కొన్న నేను ఎంతో నలిగిపోయాను. 30, 40 సినిమా అవకాశాలు వచ్చినా వదులుకున్నాను. ప్రముఖులు నాకు ఫోన్లు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. కానీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఖండన లేదు.’ అని వెల్లడించారు తనుశ్రీ.

- Advertisement -