బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తండ్రయ్యారు. దీంతో లాలూ కుటంబంలో పండుగ వాతవరణం నెలకొంది. తేజస్వీ భార్య రాజశ్రీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను తేజస్వీ యాదవ్ సోషల్‌మీడియా ద్వారా దేశ ప్రజలకు తన ఆనందాన్ని పంచుకున్నారు. దేవుడు సంతోషించి కూతురి రూపంలో బహుమతి పంపాడు అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు కుమార్తెను ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగవైరల్ అవుతుంది.
తేజస్వీ యాదవ్ రాజశ్రీ 2021 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. తొలిసారి తల్లిదండ్రులైన తేజస్వీ దంపతులకు ఆర్జేడీ నేతలతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
ईश्वर ने आनंदित होकर पुत्री रत्न के रूप में उपहार भेजा है। pic.twitter.com/UCikoi3RkM
— Tejashwi Yadav (@yadavtejashwi) March 27, 2023
ఇవి కూడా చదవండి…