తన ప్రేమ పుకార్ల పై రష్మిక స్పందన

26
- Advertisement -

రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో నేషనల్ క్రష్ రష్మిక పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై స్పందించిన రష్మిక.. విజయ్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని చెప్పింది. న్యూ ఇయర్ రోజు విజయ్‌ తో కలిసి పార్టీలు చేసుకోవడం నిజమేనన్న రష్మిక.. అదే పార్టీలో ఇంకో నలుగురు కూడా ఉన్నారని, అదెవరికీ అవసరం లేదంటూ సెటైర్ కూడా వేసింది. ఫ్రెండ్స్ అన్నాక టూర్స్‌కు వెళ్లడం కామన్ అని వెరీ రొటీన్ డైలాగ్ కూడా చెప్పేసింది. మొత్తమ్మీద రష్మిక మందాన్నా ఎక్కడా తగ్గడం లేదు.

అందుకే రష్మిక పై నెటిజన్లు కూడా ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్నారు. ఆ మధ్య తనని పరిచయం చేసిన రిషబ్ పేరు చెప్పకుండా ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పడంతో రష్మిక పై నెటిజెన్స్ ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయాన్ని తాజాగా మళ్ళీ రష్మికను అడిగారు నెటిజన్స్. దీనికి కూడా రష్మిక వెటకారంగా నవ్వుతూ సమాధానం చెప్పింది. రిషబ్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. తను లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. నాకు ఇంత పేరు వచ్చింది కూడా తన వల్లే. ఎప్పటికి నేను తనకు రుణపడి ఉంటాను అంటూ సెటైరికల్ గా చెప్పింది.

ఇవన్నీ చూసిన నెటిజెన్స్ అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రష్మిక మందాన్నా వేస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో రక్షిత్ శెట్టితో తిరిగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో తిరుగుతుంది. రష్మిక మందాన్నా పెద్ద తిరుగుబోతు అంటూ కఠినమైన పదాలు వాడుతూ నెటిజన్స్ ఆమె పై విరుచుకు పడుతున్నారు. కానీ, రష్మిక మందాన్నా మాత్రం కూల్ గా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

ఇవి కూడా చదవండి…

‘ఆర్ఆర్ఆర్ సీక్వెల్’ పై కసరత్తులు

జబర్దస్త్ షో కొత్త ముచ్చట్లు!

వీరమల్లు ట్రైలర్ ఎప్పుడంటే…

- Advertisement -