సినిమానే జీవితం కాదు

197
Tammu Beauty Secrets Revealed

దక్షిణాదిలో ఉన్న అగ్రహీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సత్తాచాటేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన బాహుబలి 2 విడుదలకు సిద్దంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై తమ్ము భారీ అంచనాలే పెట్టుకుంది. బాహుబలి సక్సెస్‌తో బాలీవుడ్‌లో పాగా వేసేందుకు మార్గం సుగుమం అవుతుందని భావిస్తున్న ఈ బ్యూటీ తన సక్సెస్ మంత్రను మీడియాతో పంచుకుంది.

తనకు అలవాట్లు తప్ప వ్యసనాలు లేవని చెబుతోంది. మీరు మానుకోవాల్సిన అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అని అడిగితే… ‘‘ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే నాకు ఏదీ అలవాటు కాదు. అలవాట్లు ముందు బాగుంటాయి. కానీ రాను రాను మనం దానికి బానిసలుగా మారిపోతాం. దేన్నయినా క్షణాల్లో వదులుకోవడం నాకు అలవాటని తెలిపింది. ఫలానా వస్తువు నాతో లేకపోతే ఏమైపోతానో.. అనే బెంగ నాకెప్పుడూ ఉండదని స్పష్టం చేసింది.

తనకు సినిమాలు కూడా అంతేనని  సినిమాలు  చేసినంత కాలం ఇదే ప్రపంచంగా బతుకుతా. ‘ఇక వద్దు’ అనుకొన్నప్పుడు మరో వ్యాపకం చూసుకొంటా. ‘సినిమాల్లేకపోతే జీవితమే లేదు’ అనే పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడను’’ అంది తమన్నా. ఇక ఈ మిల్కీ బ్యూటీ పెళ్లి ఎప్పుడంటే..‘జరిగినప్పుడు చెబుతానండి’ అని సమాధానం తుంటరి సమాధానం ఇస్తోంది.