బాలయ్య ఐటెంగా సన్ని..?

150
sunny leone item song with balakrishna

బాల‌య్య ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టే అదిరిపోయే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా వస్తోంది ఆయన 101వ సినిమా.  ఈ సినిమా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో  తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.  అయితే ఇప్ప‌టికే ఇంట‌ర్వెల్ యాక్ష‌న్ ఎపిసోడ్‌ని తెర‌కెక్కిస్తున్నాడు పూరిజగన్నాథ్‌. ఇది సినిమాకే హైలెట్‌ గా నిలుస్తుందిని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా తాజా అప్‌డేట్ ప్రకారం  బాల‌య్య సినిమాలో బాలీవుడ్ శృంగార‌తార స‌న్నీలియోన్ ఓ ఐటెం గార్ల్‌ గామెరవనుందని  తెలుస్తోంది. తన సినిమాలపై హైప్‌ పెరిగేందుకు ఏ ఒక్క ఆప్షన్‌ కి కూడా వదలని పూరి ఇప్పటికే రోగ్‌ స్టేజ్‌ పై  సన్నిని దింపేశాడు. ఇక ‘రోగ్‌’ ఆడియో వేదిక‌పై రీమిక్స్ సాంగ్ చేసిన‌ప్పుడే అస‌లు స‌న్నీని పూరి ఎందుకు దించాడు? అన్న టాక్  జోరుగానే వినిపించింది.
 sunny leone item song with balakrishna
అయితే ఇప్పుడు బాల‌య్య‌తో ఐటెమ్ చేస్తోంది అన‌గానే అస‌లు విష‌యం అర్థ‌మైంది. ఆ సాంగ్ కోసం 25 ల‌క్ష‌లు చెల్లించుకోవాల్సొచ్చింద‌ని టాక్ వ‌చ్చినా, ఒక‌వేళ బాల‌య్య సినిమాలో ఛాన్స్ పేరుతో ఉచితంగానే స‌న్నీ ఐటెమ్ చేసి ఉంటుంద‌న్న టాక్ కూడా ఇప్పుడు వినిపిస్తోంది. స‌న్నీలియోన్ ఇదివ‌ర‌కే మంచు మ‌నోజ్ ‘క‌రెంటు తీగ‌’లో అదిరిపోయే క్యారెక్ట‌ర్‌తో పాటు ఐటెమ్ నంబ‌ర్‌లోనూ చిందేసిన సంగ‌తి తెలిసిందే.