జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్‌పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విరుచుకపడ్డారు. యూట్యూబ్‌లో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సదస్సులో ఏపీ స్పెషల్ స్టేటస్ ప్రసంగంపై తమ్మారెడ్డి అసమహనం వ్యక్తం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు క్లారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,ఇతర నేతలు ఏపీకి స్పెషల్ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చేశారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేరో వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటీకి పవన్ హోదా ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్న అడగం అర్థంలేదని తమ్మారెడ్డి వ్యాఖనించారు.
పవన్ కల్యాణ్ జనహితం కోసమే రాజకీయాల్లో వచ్చాడని అందరం నమ్ముతున్నామని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే.. పవన్ ప్రత్యేక హోదాపై బయటికొచ్చి పోరాడాలన్నారు. గత నెల జనవరి 26న ప్రత్యేక హోదా కోసం వైజాగ్ ఆర్కే బీచ్‌లో తలపెట్టిన కార్యక్రమానికి విద్యార్థులు శ్రీకారం చుట్టారు. యువత భారీ ఎత్తున కదిలొచ్చినా.. సంపూర్ణేష్ వారికి మద్దతు పలికి అరెస్టయినా పవన్ రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కంటే సంపూర్ణేష్ బాబు మేలు అని వ్యాఖనించారు.
స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోవడానికి ఇప్పటికే కేంద్రం వివరణలు ఇచ్చినా.. మళ్లీ ఆయన ఎందుకు ఇవ్వలేదు అని అడగడం వెనక ఆంతర్యం ఏమిటి? అంటే మద్దతు కోసం చంద్రబాబు నాయుడు అప్పుడు ఫోన్ చేశాడు కాబట్టి.. ఇప్పుడు కూడా ఇంటికొచ్చి కలిసి వెళ్లాల, లేదంటే ఫోన్ చేసే స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలనా? లేదంటే అప్పుడు మద్దతు కోసం ఫోన్ చేసిన ప్రధాని.. మళ్లీ ఇప్పుడు కూడా ఫోన్ చేసి స్వయంగా తనకు చెప్పాలనా? అంటూ తమ్మారెడ్డి ఎద్దెవ చేశారు.
2019 ఎన్నికల కోసమే అన్ని పార్టీలూ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మట్లాడుతున్నాయని తమ్మారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కావాలంటే పోరాడండి… కానీ, ఇలా మాటలు చెప్పొద్దు అంటూ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖనించారు. ప్రత్యేక హోదా రావాలంటే.. ఫిరంగులకు గుండెను అడ్డంపెట్టే వాళ్లు కావాలని పవన్ అంటున్నారు. అలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వైజాగ్ ఆందోళనలో.. పోలీసులు అష్టదిగ్బంధనం చేసినా యువత ముందుకు రావడమే అందుకు ఉదాహరణ.
యువత పిలుపునకు భయపడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 26 ఆందోళనలకు భారీ బందోబస్తు పెట్టింది. పవన్ నిజంగా ప్రజల హక్కుల కోసమే పోరాడితే.. పవన్ బాటలో అనేక మంది నడుస్తారు. మేం కూడా పవన్ బాటలో అడుగులేస్తాం’’ అని తమ్మారెడ్డి భరద్వాజ పవన్‌పై విమర్శలు గుప్పించారు. ‘నా ఆలోచన’ అంటూ యూ ట్యూబ్‌లో ఈ విమర్శలను సంధించారు తమ్మారెడ్డి.