గవర్నర్ తేనెటి విందును బహిష్కరించిన కాంగ్రెస్

8
- Advertisement -

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ రవి ఇచ్చే తేనెటి విందును బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన డీఎంకే ప్రభుత్వ పనితీరును అడ్డుకునేందుకు గవర్నర్ నిరంతరం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు గవర్నర్ రవి ఇస్తున్న టీ విందును బహిష్కరిస్తున్నామని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పట్ల తమిళనాడు గవర్నర్‌కు ఏ మాత్రం గౌరవం లేదని, సీఎం స్టాలిన్ సిఫార్సులను నిరంతరం తిరస్కరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రి మండలి సహాయ, సలహాలకు అనుగుణంగానే గవర్నర్ వ్యవహరించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 163ని పూర్తిగా ధిక్కరిస్తున్నారని సెల్వపెరుంతగై అన్నారు.

తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ఆమోదం తెలపాలని కానీ గవర్నర్ అలా చేయడం లేదన్నారు. గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారని, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్పష్టమైన తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు.

Also Read:సుప్రీం కోర్టుకు దాసోజు, కుర్ర సత్యనారాయణ

- Advertisement -