తమిళనాడులో అమల్లోకి లాక్‌డౌన్..

124
stalin
- Advertisement -

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభన కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ పట్టగా తాజాగా తమిళనాడులో నేటి నుండి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. గురువారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఇక, ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టేక్ అవే సర్వీస్ అందించేందుకు రెస్టారెంట్లకు పర్మిషన్ ఇచ్చారు.పండుగల సీజన్లో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పొంగల్ పండుగకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

- Advertisement -