Tamilnadu: భారీ వర్షాలు.. కొట్టుకుపోతున్న కార్లు, బస్సులు

5
- Advertisement -

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కార్లు, బస్సులు కొట్టుకుపోతుండగా ‘ఫెంగల్’ తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి.

పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలపై తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించగా రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

తుఫాన్ ప్రభావంతో ఏపీలోని తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలోని తలకోన జలపాతం వద్ద ఆంక్షలు విధించారు. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో తలకోన జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహం పెరగడంతో జలపాతం వద్ద వారం పాటు ఆంక్షలు విధించగా ముందస్తు చర్యలో భాగంగా ఆంక్షలు విధించారు ఫారెస్ట్ అధికారులు.

Also Read:రేవంత్ రెడ్డి అపరిచితుడు: హరీశ్‌

- Advertisement -