బలవంతంగా అప్పు..ఐదేళ్ల జైలు శిక్ష!

12
- Advertisement -

బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష పడే బిల్లును తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును అమోదించారు గవర్నర్. ప్రజల వద్ద కొన్ని రుణసంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని తెలిపింది తమిళనాడు ప్రభుత్వం.

ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసినా, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది తమిళనాడు ప్రభుత్వం.

రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని పేర్కొంది.

Also Read:చంద్రప్రభ వాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుడు

- Advertisement -