చంద్రప్రభ వాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుడు

12
- Advertisement -

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 07.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి  చంద్రప్రభ వాహనంపై వెన్న చిన్ని కృష్ణుడు అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.

సా. 5.00 – 05.30 గం.ల మధ్య ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేశారు. సా. 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు.శుక్రవారం రాత్రి 07.00 గం.లకు చంద్రప్రభ ప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.

జూన్ 14న శనివారం ఉదయం 09.00 గం.లకు రథోత్సవం జరుగుతుంది. వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

Also Read:కేటీఆర్‌కు నోటీసులు..రాజకీయ కక్ష సాధింపే?

- Advertisement -