తమిళనాడు సీఎంకు అస్వస్థత..

24
stalin cm
- Advertisement -

తమిళనాడు సీఎం స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తేలికపాటి జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు స్టాలిన్. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది.

వాస్తవానికి స్టాలిన్‌ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. స్టాలిన్‌ పర్యటనకు అధికారులు, డీఎంకే నేతలు భారీగా ఏర్పాట్లు చేపడుతున్న తరుణంలో ఆయన జ్వరంతో అస్వస్థత చెందారు. ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందని, ఈ మూడుజిల్లాల్లో ఆయన పర్యటించే తేదీలను త్వరలో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.

- Advertisement -