దీపావ‌ళి బ‌రిలో ఆన‌లుగురు స్టార్ హీరోలు..

292
vijay, vishal, dhanush, surya
- Advertisement -

ఏదైనా పెద్ద పండ‌గ‌లు వ‌స్తున్నాయంటే చాలు స్టార్ హీరోల సినిమాలు సంద‌డి చేస్తాయి. తెలుగులోనే కాదు త‌మిళ్, కేర‌ళ ప‌లు రాష్ట్ర‌ల్లో కూడా ఇదే హ‌వా కొన‌సాగుతుంది. తెలుగులో అయితే సంక్రాంతి, ద‌స‌రా కు ఎక్కువ‌గా స్టార్ హీరోల సినిమాలు విడుద‌ల‌వుతాయి. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఇదే హ‌వా న‌డుస్తుంది. ఈ దీపావ‌ళికి త‌మ‌ళ్ లో న‌లుగురు స్టార్ హీరోల సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. న‌లుగురు స్టార్ హీరోల సినిమాల‌తో కోలీవుడ్ లో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేయ‌నున్నారు.

Vijay, Vishal

త‌మిళ స్టార్ విజ‌య్ ప్ర‌స్తుతం స‌ర్కార్ చిత్రంలో బిజీగా ఉండ‌గా, విశాల్ సండ‌కోళి2 చిత్రంతో రాగా, థ‌నుష్ మారి 2, సూర్య ఎన్ జీకే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ విజ‌య్ కాంబినేష‌ణ్ లో తెర‌కెక్కుతున్న స‌ర్కార్ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను ఇటివ‌లే విడుద‌ల చేశారు. ఈట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. ఈమూవీలో విజ‌య్ కొత్తలుక్ లో క‌నిపిస్తున్నాడు. ఈసినిమాపై అభిమానులు భారీ అంచానాలు పెట్టుకున్నారు.

గ‌తంలో విశాల్ న‌టించి భారీ విజ‌యాన్ని అందుకున్న సందెంకోడి..తెలుగులో పందెంకోడి గా విడుద‌లై రెండు భాషల్లో మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్ప‌డు సందెంకోడి 2తో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈమూవీని కూడా దీపావ‌ళికి విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్. ఈసినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ న‌టిస్తుంది. ఇక ధ‌నుష్ హీరోగా న‌టించిన మారి సినిమాకి సిక్వేల్ గా మారి2 ను తెర‌కెక్కి్స్తున్నారు. ధ‌నుష్ కు జోడిగా సాయి ప‌ల్ల‌వి హీరోయిన్గా న‌టిస్తుంది. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా ఎన్జీకే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలో సూర్య స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈ న‌లుగురు దీపావ‌ళికి రంగంలోకి దిగ‌నున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -