దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కలికితురాయి. తలైవాగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్న…72వయేట ఆడగుపెట్టనున్నారు. కర్ణాటకలోని మరాఠా కుటుంబంలో డిసెంబర్ 12,1950న జన్మించారు. బస్ కండక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన తలైవా…సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆన్ స్క్రీన్ మీద ఆయన నటన, ఆఫ్-స్క్రీన్ లో సింప్లిసిటీని ప్రేక్షకులు ఎంతో ఇష్టపడుతారు.
సినీ రంగానికి తను చేసిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. నటన రంగంలో విశిష్ట సేవలకు గాను దాదాసాహెబ్ పురస్కారంను కూడా దక్కించుకున్నారు. రజనీ కాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. సినిమాలోకి వచ్చిన తొలినాళ్లో ఆ పేరును మార్చుకొని రజనీకాంత్‌గా స్థిరపడ్డారు. ఎందుకంటే తమిళంలో అంతకుముందే శివాజీ గణేషన్ అనే దిగ్గజ నటుడు ఉన్నారు.
రజనీకాంత్ 1975లో దర్శకుడు కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. 15, ఆగస్ట్ 1975న విడుదల అయ్యింది. తొలి చిత్రమే చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.
రజనీ కాంత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో విలన్‌గా కెరీర్ మొదలు పెట్టారు. 72 ఏళ్ల ఈ నటుడి కెరీర్‌లోని తొలి రెండు సంవత్సరాలు కేవలం నెగెటివ్ రోల్స్ మాత్రమే లభించాయి. ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం అయిన ‘భువన ఒరు కెల్విక్కురి’ చిత్రంతో మంచి పాత్రలు పోషించడం మొదలు పెట్టారు.
రజనీకాంత్ లతా రంగాచారిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం లత చెన్నైలో ది ఆశ్రమ్ అనే పాఠశాలను నడుపుతున్నారు. రజనీ, లతలకు ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఉన్నారు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య నటుడు ధనుష్‌ను వివాహం చేసుకుంది. అతని చిన్న కుమార్తె సౌందర్య నటుడు, వ్యాపారవేత్త అయిన విషగన్ వనంగముడిని పెళ్లి చేసుకుంది.
దీవార్, అమర్ అక్బర్ ఆంటోనీ, లావారీస్, డాన్ సహా అమితాబ్ బచ్చన్ నటించిన 11 సినిమాలను రజనీకాంత్ రీమేక్ చేశారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి. ట్విటర్‌లో సూపర్ స్టార్‌కు ప్రపంచ వ్యాప్తంగా 5.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
రజనీకాంత్ హిందూ మతాన్ని, ఆధ్యాత్మికతను బలంగా విశ్వసిస్తారు. యోగా, ధ్యానం చేస్తారు. రజనీ ఇప్పటివరకూ 170సినిమాల్లో నటించారు. ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారు. అన్నట్టు తలైవాకు కార్లకు వీరాభిమాని. ఆయన వద్ద రూ. 16.5 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్, రూ. 6 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఉన్నాయి. BMW X5, మెర్సిడెస్. బెంజ్ జీ వ్యాగన్, లంబోర్ఘిని ఉరుస్, ప్రిమియర్ పద్మిని, టయోటా ఇన్నోవా, అంబాస్యాడ్ ఇన్నోవా, బెంట్లీ లిమోసిన్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి…
ధమాకా..అప్‌డేట్
వాల్తేరు వీరయ్య.. మాస్ రాజ టీజర్ అదుర్స్ !