తమిళనాడులో మరోసారి లాక్‌డౌన్‌..

187
Tamil Nadu
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో మరో సారి లాక్‌డౌన్‌ ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. ఇందులో భాగంగా నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాలో ఈనెల 19నుంచి 30 వరకు లాక్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

లాక్‌డౌన్‌ సమయంలో ఆయా జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి 2గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 33శాతం ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

- Advertisement -