రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో జోరుగా వానలు..

255
- Advertisement -

ఉత్తర అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, డయ్యూ మొత్తం ప్రాంతాలు, మధ్యప్రదేశ్ లో మరికొన్ని ప్రాంతాలు, చత్తీస్ గఢ్, ఝార్ఖండ్ మరియు బీహార్ లో మిగిలిన ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి. తూర్పు మధ్యప్రదేశ్ లో మరికొన్ని ప్రాంతాలు,తూర్పు ఉత్తర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు రాగల 48 గంటలలో విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా జూన్ 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

- Advertisement -