గవర్నర్‌ ముందు రెండు ఆప్షన్లు….

208
- Advertisement -

జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న శశికళ దోషేనని కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు ప్రకటించింది.  వారికి శిక్ష విధించాల్సిందేనని  కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ తీర్పును చదువుతూ, ఈ కేసు తీవ్రమైనదని వ్యాఖ్యానించారు. చట్టాన్ని మీరి ప్రవర్తించినట్టు స్పష్టమవుతోందని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయ,శశికళతో పాటు మిగిలిన నలుగురు నిందితులంతా దోషులేనని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. చిన్నమ్మకు నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదికోట్లు జరిమాన విధిస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది.
Tamil Nadu Governor Gets Two Options
ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ వాతవరణం నెలకొంది. తమిళనాడు ఇంచార్జ్‌ గవర్నర్‌గా ఉన్న సీహెచ్‌ విద్యాసాగర్‌ సుప్రీంకోర్టు తీర్పు అంశాన్ని చాలా సునిశితంగా పరిశీలన చేస్తున్నారు. గవర్నర్‌కు ప్రస్తుతం రెండు ఆప్షన్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందులో మొదటిది పన్నీర్‌ సెల్వంను బలనిరూపణ చేసుకోమని ప్రకటించడం, రెండవది అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే సభలోనే సభా నాయకుడిని ఎన్నుకోమని సూచించడం. ప్రస్తుతం ఈ రెండు అంశాలపైనే గవర్నర్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రకటన ఎప్పుడు చేస్తారనే విషయంపై సస్పెన్స్‌ నెలకొంది. మరోవైపు శశికళను అరెస్ట్‌ చేయడానికి పోయాస్‌ గార్డెన్‌కు పోలీసులు చేరుకున్నారు. పన్నీర్‌ సెల్వం ఇంటి వద్ద పోలీసులు మరింత భద్రతను పెంచారు.

- Advertisement -