తెలంగాణ ప్రభుత్వానికి బాసటగా తమిళనాడు..

208
CM Palaniswami
- Advertisement -

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో ముంపు బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరును తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రశంసించారు. వ‌ర‌ద బాధితుల కోసం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించారు. తెలంగాణ‌కు ఆపత్కాలంలో మీ వెంట మేమున్నాం అంటూ సీఎం ప‌ళ‌నిస్వామి భరోసా ఇచ్చారు. బ్లాంకెట్స్, మాట్స్ ను తెలంగాణాకు తమిళనాడు పంపింది. ఈ మేరకు తమిళనాడు సీఎం ఓ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా సీఎం ప‌ళ‌నిస్వామికి మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

త‌క్ష‌ణ సాయం కింద రూ. 1,350 కోట్లు ఇవ్వాల‌ని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి స్పంద‌న రాలేదు.. వ‌స్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. మీడియా కూడా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. స‌మ‌స్య‌లు త‌మ దృష్టికి తీసుకువ‌స్తే త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాల‌నీల్లోని ప్ర‌జ‌ల‌ను క‌చ్చితంగా ఆదుకుంటామ‌న్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 33 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 29 మందికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సాయం అందించామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.

- Advertisement -