కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్‌.. వీడియో

506
karthi
- Advertisement -

తమిళ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం ఖైదీ. ఈ దీపావళికి ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. ఖాకీ చిత్రం తర్వత ఆ రెంజ్‌ యాక్షన్ ఎంటర్ టైనర్ ఖైదీతో కార్తి ప్రేక్షకుల ముందుకు మళ్ళీ రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ట్రైలర్‌ విషయానికి వస్తే.. వందల కోట్ల విలువైన మాదకద్రవ్యాల సరుకును కొందరు రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకుంటారు. కాని అనూహ్యంగా దాన్నో దొంగల ముఠా కాజేస్తుంది. ఎక్కడికి వెళ్ళారో అంతు చిక్కదు. కరుడు గట్టిన ఆ నేరస్తులను పట్టుకోవడం కోసం జైల్లో యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ(కార్తి) సహాయం తీసుకుంటారు పోలీసులు. ఇతను ఆ ముఠా సరుకు ఎత్తుకెళ్ళిన లారీ వెనుక పడతాడు.

కాని ప్రయాణం చాలా ప్రమాదకరంగా మారుతుంది. హాస్టల్ లో ఉన్న తన కూతురి కోసం ఇదంతా చేస్తున్న ఢిల్లీ చివరికి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేదే అసలు కథ. ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వ వహించారు. సత్యన్ సూరన్ ఛాయాగ్రహణం సామ్ సంగీతం అందిచారు.

- Advertisement -