జల్లికట్టుకు ఆల్‌ ఖైదాకు లింకు …

219
Tamil Celebs Satires on RGV
- Advertisement -

సినీనటులపైనే కాదు ప్రతి అంశంపై స్పందించే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్‌కు పనిచెప్పాడు. జల్లికట్టుకు అనుమతివ్వాలంటూ తమిళనాట ఆందోళనలు మిన్నంటిన వేళ వర్మ వారిపై తనదైన శైలీలో విరుచుకపడ్డాడు. జల్లికట్టు కోసం పోరాడుతున్న వారంతా రక్తం మరిగిన మానవ రూపంలో ఉన్న రాబందులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమాయక జీవులను హింసిస్తూ దానికి సాంప్రదాయం అనే ముసుగువేయడం దారుణమని ట్విట్ చేశారు. జల్లికట్టును కోరుతున్న ఒక్కొక్కరిపై 100 ఎద్దులను వదలాలని… అప్పుడు కానీ ఎద్దులు పడుతున్న బాధ ఏంటో వారికి అర్థం కాదని వర్మ అన్నారు. జల్లికట్టు కోసం పోరాడుతున్న వారికి సాంప్రదాయానికి స్పెల్లింగ్ కూడా తెలవదని ఎద్దేవా చేశారు.

Tamil Celebs Satires on RGV

అమాయక జంతువులను హింసించే జల్లికట్టు సాంప్రదాయం కరెక్ట్ అయితే… అమాయక ప్రజలను హింసించే ఉగ్ర సంస్థ ఆల్ ఖైదా కూడా కరెక్టేనని చెప్పారు. సినిమాల్లో కాకులు, కుక్కలను చూపించడం కూడా నేరమని … అలాంటిది సాంప్రదాయం పేరుతో ఎద్దులను రాక్షసంగా హింసించడాన్ని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుందని వర్మ ప్రశ్నించారు. జల్లికట్టు సమయంలో ఆ ఎద్దుల కొమ్ములు, చెవులు, తోక విరిగిపోతాయని … ముక్కుకు కట్టిన తాడు వల్ల విపరీతమైన బాధను అనుభవించి మరణిస్తాయని ఇది అనాగరికమని అన్నారు.

జల్లికట్టు కోసం పోరాడుతున్నవారంతా జంతువులను హింసించే హక్కు కోసం పోరాడుతున్నారని చెప్పారు. జంతువులకు ఓటు హక్కు ఉంటే … ఏ రాజకీయ నేత అయినా జల్లికట్టుకు మద్దతు తెలిపేవాడా అని ప్రశ్నించారు.

Tamil Celebs Satires on RGV

వర్మ ట్విట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు .. వర్మ మీద వెటకారాలకు దిగాడు. జల్లికట్టుకు మద్దతుగా నిలుస్తున్న వాళ్లలో ఒక్కొక్కరి వెనుక వందల గేదెల్ని తరమాలని.. అప్పుడు వాళ్ల ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలని ఉందని వర్మ వ్యాఖ్యానిస్తే .. ‘‘ఒకసారి అలగనూర్ వరకు వచ్చి వెళ్లండి సార్. ఇక్కడొచ్చి మీ అభిప్రాయమేంటో మా కుర్రాళ్లకు చెప్పండి. వాళ్ల ఫీలింగేంటో వినండి. మీ కోసం మేం ఎదురు చూస్తున్నాం’’ అన్నాడు వెంకట్. తమిళ హీరో జై సైతం వర్మపై మండిపడ్డాడు. పిజ్జా సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సైతం ‘‘నువ్వు మా లిస్టులోనే లేవుగా గోపాలూ..’’ అంటూ వర్మపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

ఇదిఇలా ఉండగా తమిళ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ అగ్రహీరోలు పవన్, మహేష్, రానా, అఖిల్‌తో సహా పలువురు ప్రముఖులు జల్లికట్టుకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తమిళుల ఆందోళనలకు తలొగ్గిన కేంద్రం జల్లికట్టుకు అమోదం తెలిపింది.

- Advertisement -