బాహుబలికి పెళ్లంటా..!

73
Krishnam

టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ బ్యాచిలర్ అంటే టక్కున చెప్పే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తోటిహీరోలంతా పెళ్లి చేసుకుని..పుత్రోత్సాహాం పొందుతుంటే..ఈ 37 ఏళ్ల ప్రభాస్ మాత్రం ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌..బాహుబలి-2’ రిలీజ్ తర్వాత పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ప్రభాస్ పెదనాన్న క్రిష్ణంరాజు ఓ క్లారిటీ ఇచ్చాడు.

Krishnam

ప్రభాస్‌ పెళ్లి ఈ ఏడాది కచ్చితంగా ఉంటుందని ఆయన పెదనాన్న కృష్ణంరాజు వెల్లడించారు. ‘బాహుబలి-2’ విడుదల తర్వాత ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటాడని కృష్ణంరాజు అంటున్నారు. తనకు తెలిసినంతవరకు సుజిత్‌ సినిమా మొదలు పెట్టేముందే పెళ్లి ఉండొచ్చని తెలిపారు. అయితే ఆ అమ్మాయి ఎవరో, ఏ ప్రాంతానికి చెందినదో మాత్రం చెప్పడానికి నిరాకరించారు. అన్ని వివరాలూ ‘బాహుబలి-2’ విడుదల తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఆ అమ్మాయి గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి అని, ఆమెను ప్రభాస్‌ తల్లి సెలెక్ట్‌ చేశారని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ పెళ్లి గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ‘బాహుబలి-2’ విడుదల వరకు ఆగాల్సిందే. బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు ప్రభాస్‌. ప్రస్తుతం ‘బాహుబలి-2’తో మరోసారి అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా పనులను పూర్తి చేసిన ప్రభాస్‌.. సుజిత్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.