ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ఇళయ దళపతి విజయ్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ లో విజయ్, ప్రశాంత్ కిషోర్ కలిసి రాజకీయ మంతనాలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తమిళనాట డీఎంకే తిరుగులేని శక్తిగా ఉండగా ప్రధానప్రతిపక్షమైన అన్నాడీఎంకే నాయకత్వలేమితో ఆ పార్టీ క్యాడర్ అంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ భవిష్యత్తు ఏంటో తెలియక సతమతమవుతున్న తరుణంలో పీకే- విజయ్ భేటీతో అన్నాడీఎంకే నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ఒకవేళ విజయ్ పార్టీ పెడితే అందరు విజయ్ పార్టీలోకి చేరే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలే టార్గెట్‌గా విజయ్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ మయ్యం అనే పేరుతో పార్టీని రిజిస్టర్ చేయగా దానిని బలవంతంగా విరమింపచేశారు విజయ్.