గోపిచంద్‌తో తమన్నా రొమాన్స్…!

675
tamanna
- Advertisement -

మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కానుంది. గతంలో వీరి కలయికలో వచ్చిన గౌతమ్ నంద హిట్ కాకపోయిన గోపిచంద్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. గోపిచంద్‌కు 28వ సినిమాగా వస్తున్న ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీలో గోపిచంద్‌తో కలిసి మిల్కీబ్యూటీ తమన్నా రొమాన్స్ చేయనుందని దర్శకుడు సంపత్ నంది ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ప్రస్తుతం తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో గోపిచంద్‌ నటిస్తున్న చాణక్య దసరాకు విడుదల కానుంది. దీంతో పాటు బినూ సుబ్రమణియన్ అనే మరో తమిళ దర్శకుడితో గోపిచంద్ సినిమా ఇటీవలే ప్రారంభంమైంది. ఈ రెండు సినిమాల తర్వాత సంపత్ నంది- గోపిచంద్ మూవీ పట్టాలెక్కనుంది.

- Advertisement -