‘గద్దలకొండ గణేష్’ని అభినందించిన చిరు-మహేష్‌..

575
- Advertisement -

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఎస్ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ‘గద్దలకొండగణేష్‌’ సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి సూపర్‌హిట్‌ కలెక్షన్స్‌ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవీ,సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు.

Megastar chiru

 

మంగళవారం (సెప్టెంబర్ 24) ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి వరుణ్ పెర్ఫార్మన్స్ చాలా బాగుందని. హరీష్ శంకర్ చాలా బాగా తీశాడు, డైలాగ్స్ చాలా బాగున్నాయని అన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మాతలు ఈ చిత్రాన్నితీశారని. సినిమాలో టీం స్పిరిట్ కనిపిస్తోందని ఆయన ప్రశంసిస్తూ ఈ అద్భుత విజయాన్ని సాధించిన టీం అందరికీ విజయాభినందనలు తెలిపారు.

ఇక మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో ‘గద్దలకొండ గణేష్’ సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను. వరుణ్ తేజ్ గణేష్‌గా అద్భుతంగా నటించాడు. హరీష్ శంకర్, 14 రీల్స్ ప‌నితీరు బాగుంది. అలాగే మంచి సక్సెస్ ను అందుకున్న చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు మ‌హేష్‌. ఆయన‌ ట్వీట్‌ని రీ ట్విట్ చేస్తూ హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు రామ్, గోపి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -