ప్యాన్స్‌ని డిసప్పాయింట్ చేయని తమన్నా..

329
- Advertisement -

టాలీవుడ్, కోలీవుడ్-బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తుంది అందాల భామ మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటివలే అభినేత్రి, జాగ్వార్లో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. హీరోయిన్ గా చేస్తునే.. ఐటమ్ సాంగులతో కూడా దుమ్ము లేపుతోంది. అయితే ఇప్పటివరకు మిల్కీ బ్యూటీ ఏ హీరోతోను, ఏ కుర్రాడితోనో ప్రేమలో పడలేదు. ఆమె తన ప్రొఫెషన్తో ప్రేమలో పడిపోయింది. సినిమానే తింటూ తాగుతూ నిద్రపోతోందట.

tamanna-item-song-2

ఇక అభినేత్రి సినిమాలో తమన్నా అదరగొట్టిందంటూ సినీ జనాలు చెబుతున్నారు. తమన్నా, ప్రభుదేవా కాంబినేషన్‌లో‘అభినేత్రి’ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు.. ఈ సినిమాపై కొత్త క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ తరువాత తమన్నా చీర కట్టుకున్న లుక్‌ని విడుదల చేసినప్పుడు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఆ తరువాత వచ్చిన టీజర్‌లో కూడా ప్రభుదేవాకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. దీంతో తమన్నా ప్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. నటనకంటే స్కిన్ షో, డ్యాన్స్‌లు తమన్నా బలం అన్న విషయం తెలిసిందే. అలాంటిది కంప్లీట్ డీ గ్లామరస్ రోల్ అనేసరికి విమర్శలు వచ్చాయి.

tammana-6

అభినేత్రి విడుదలైన తరువాత తమన్నా అభిమానుల అనుమానాలు పటాపంచలయ్యాయి. తమన్నా రెండు క్యారెక్టర్స్‌లో అంటే.. ఒక క్యారెక్టర్ డీ గ్లామర్‌తో ఉంటే రెండో క్యారెక్టర్ గ్లామరస్‌గా ఉంది. అంతేకాకుండా ప్రభుదేవాకి దీటుగా తమన్నా కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఏది ఎలా ఉన్నా తమన్నా తన అభిమానులను మాత్రం డిసప్పాయింట్ చేయదని మరోసారి ప్రూవ్ చేసుకుంది.

- Advertisement -